![]() |
![]() |

ఆహా ఓటిటి వేదికగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1 ఎంత సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే..ఇక ఇప్పుడు మరింత క్రేజ్ తో సీజన్ 2 ఆడియన్స్ ముందుకు రాబోతోంది. సంగీత ప్రియులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న ఈ షో త్వరలో అలరించడానికి సిద్ధంగా ఉంది. అందుకు గాను ఇప్పుడు ఆడిషన్స్ ని స్టార్ట్ చేశారు ఈ షో మేకర్స్. ఈ ఆడిషన్స్ కి సంబంధించిన ఒక టీజర్ ని ఇప్పటికే రిలీజ్ చేశారు. ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 1 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఇందులోని సింగర్స్ కి మంచి మంచి అవకాశాలు వచ్చాయి.
ఇక ఈ బిగ్గెస్ట్ సింగింగ్ రియాలిటీ షోకి సంబంధించిన ఆడిషన్స్ త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. ఐతే సీజన్ 1 ఓటిటి సిరీస్. మరి సీజన్ 2 కి ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతారా లేదా టీవీ సిరీస్ గా చేసే అవకాశం ఉందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. శ్రీరామచంద్ర హోస్ట్ చేసిన సీజన్ 1 కి తెలుగు ఇండియన్ ఐడల్‌కు థమన్ ఎస్, నిత్యా మీనన్ , కార్తీక్ జడ్జెస్ గా వ్యవహరించారు. ఇందులో నెల్లూరుకు చెందిన యంగ్, టాలెంటెడ్ సింగర్ వాగ్దేవి టైటిల్ విన్నర్ గా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి ఆమెకు అవార్డుని అందించారు. ఇక ఈ కార్యక్రమానికి రానా దగ్గుబాటి, మణిశర్మ, బాలకృష్ణ వంటి ప్రముఖులు గెస్టులుగా వచ్చి ఈ షోలో సందడి చేశారు.
![]() |
![]() |